Sunday, May 4, 2025
- Advertisement -

బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ..!

- Advertisement -

బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ అయింది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్‌లో తెలంగాణ నుండి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పెద్దల పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మిగిలిన 8 స్థానాలకు సంబంధించిన ఆశావాహుల జాబితాను అందజేశారు. ఖమ్మం నుండి జలగం వెంకట్రావ్, మహబూబాబాద్ నుండి సీతారం నాయక్‌ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.అలాగే ఆదిలాబాద్ నుండి నగేష్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు పోటీ పడుతుండగా వరంగల్ నుంచి కృష్ణ ప్రసాద్, నల్గొండ నుంచి మనోహర్ రెడ్డి,పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ కోసం ఎస్ కుమార్, మిట్టపల్లి సురేంద్ర పోటీ పడుతున్నారు. మెదక్ టికెట్ కోసం రఘునందన్ రావు, అంజిరెడ్డిలు పోటీ పడుతుండగా వీరిలో ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -