Monday, May 5, 2025
- Advertisement -

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్, హైలైట్స్ ఇవే

- Advertisement -

తెలంగాణ వస్తేనే బ్రతకులు బాగుపడతాయని ప్రజలు ఆందోళన చేశారన్నారని..ఆ ఆకాంక్షలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నెరవేర్చారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర బడ్జెట్ 2024-25 సందర్భంగా మాట్లాడిన భట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలను గత పాలకులు పలికారన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఫలితంగా అప్పుల కుప్పగా మారిందన్నారు. కనీసం ఉద్యోగులు వేతనాలు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి అప్పులు తీసుకున్న పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. తెలంగాణ అప్పు 6 లక్షల 72 వేల కోట్లకు చేరిందన్నారు. గత పది సంవత్సరాల్లో తెలంగాణ అప్పు పదిరేట్లు పెరిగిందన్నారు. తప్పుడు నిర్ణయాల వల్ల సాగునీటి రంగంలో ఆశీంచిన అభివృద్ధి జరగలేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కుంటుపడిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులు, పెన్షన్ దారులకు ప్రతినెల ఒకటో తారీఖునే జీతాలు, పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలందరికి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. రూ.2,91,159 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టగా రూ,2,20,945 కోట్ల రెవెన్యూ వ్యయం,రూ.33,487 కోట్ల మూలధన వ్యయం అని చెప్పారు.

()సాగునీటి శాఖకు రూ.26 వేల కోట్లు
()31 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం
()నిరుపేద కూలీలకు ఈ ఏడాది నుండి రూ.12 వేలు
()వ్యవసాయ రంగానికి రూ.72 ,659 కోట్లు
()గృహజ్యోతి స్కీంకు రూ. 2,418 కోట్లు
()గ్యాస్ సబ్సిడీ స్కీంకు రూ.723 కోట్లు
() సివిల్ సప్లై కోసం రూ.3836 కోట్లు
()పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,816 కోట్లు
()మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
()హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు
()మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు
()పశుసంవర్ధక రంగానికి రూ.1980 కోట్లు
(0విద్యుత్ శాఖకు రూ,16,410 కోట్లు
()ఆరోగ్య, వైద్య శాఖకు రూ. 11,468 కోట్లు
()మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు
()పరిశ్రమల శాఖకు రూ.2736 కోట్లు
()ఎస్సీ సంక్షేమం కోసం రూ, 33,124 కోట్లు
()ఎస్టీ సంక్షేమం కోసం రూ.17,056 కోట్లు
()స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ. 2736 కోట్లు
()బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు
()నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు
()హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు
()మహిశా శక్తి క్యాంటీన్లకు రూ. 50 కోట్లు
()ఉచిత రవాణా రూ.723 కోట్లు
()జీహెచ్‌ఎంసీకి రూ.3000 కోట్లు
()హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు
()ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -