తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని….రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించనుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని …క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
అలాగే తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం అవసరమైన రూ.437 కోట్లు విడుదలకి కేబినెట్ ఆమోదించింది.
కేరళలో వాయనాడ్ విపత్తుకు కేబినెట్ ప్రగాఢ సానుభూతి తెలిపింది కేబినెట్. బాధిత కుటుంబాలకు తెలంగాణ పక్షాన ఆర్ధిక, వైద్య అన్ని అంశాల్లో సహయ సహకారాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, రేషన్ కార్డులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహలతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
క్రీడాకారులు ఈషాసింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ (రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్), క్రికెటర్ సిరాజ్ లకు(టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడు) గ్రూప్ 1 ఉద్యోగం. 600 గజాల జాగా ఇవ్వాలని నిర్ణయించింది. రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం తరుపున నామినేట్ చేశాం అని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన చేస్తాం అని, గోదావరి నీటిని హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తాం అని వెల్లడించారు.