Saturday, May 3, 2025
- Advertisement -

ఉన్నది ఆరు..రేసులో డజను మంది!

- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం రోజుకో సినిమా ట్విస్ట్‌ను తలపిస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరుగురికి అవకాశం ఉండగా ఆశావాహుల సంఖ్య చాంతాడంత ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరందుకుంటుండగా ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ చివరకు వారికి నిరాశే మిగులుతోంది.

ఇక ఈ ఉగాదికి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. అయితే ఇక్కడ మంత్రి పదవి ఆశీంచిన వారు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు లాంటి వారైతే సీనియర్ నేతల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు కూడా.

ఏడాదిన్నరంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన నేతలు తమకు అడ్డుపడుతున్న నేతలపై మీడియా ముందే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌ ముందే వివేక్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రేమ్‌సాగర్ రావు. పార్టీలు మారి వచ్చిన నేతకు మంత్రిపదవి ఇస్తే నష్టం తప్పదని కామెంట్ చేశారు. అంతేగాదు తనకు అన్యాయం చేస్తే స‌హించేది లేద‌ని హెచ్చరించారు.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అయితే జానారెడ్డి తనకు మంత్రిపదవి రాకుండా అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. అలాగే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా ఒక్కరి మధ్య సఖ్యత కూడా లేదు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజ‌య్‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నేతల మధ్య వర్గపోరు ఇలా ఉంటే ఎమ్మెల్సీ కోదండ‌రాం, ఎమ్మెల్సీగా పదవి పొందిన విజ‌య‌శాంతి, అద్దంకి ద‌యాక‌ర్‌ కూడా మంత్రి ప‌ద‌వులు కావాల‌ని ఆశిస్తున్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రూపు రాజ‌కీయాల‌ను అరిక‌ట్ట‌డంలో అధిష్ఠానం విఫలమైందని వాదన వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -