Sunday, May 4, 2025
- Advertisement -

దసరా తర్వాతే కాంగ్రెస్ రెండో లిస్ట్!

- Advertisement -

55 మందితో తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఈ జాబితాలో టికెట్ ఆశీంచి భంగపడ్డ నేతలంతా హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. అందుకే రెండో జాబితా రిలీజ్‌ని అన్ని ఆలోచించాకే విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో రెండో జాబితాపై దాదాపు 5 గంటలపాటు సమావేశం జరుగగా ప్రధానంగా 64 స్థానాలపై చర్చించినట్లు తెలుస్తోంది.వివాదం లేని సీట్లపై చర్చించి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇక కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దసరా తర్వాతే రెండో జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా కమ్యూనిస్టులకు ఇచ్చే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. వామపక్షాలతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో సీటు దక్కనివారు బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లి పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని బుజ్జగించాకే లీస్ట్‌కు ప్రకటించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్ది లీస్ట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు సైతం టెన్షన్‌లోనే ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -