తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన భట్టి..కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరు సోషల్ మీడియాలో బతుకుతున్నారని, వారి మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న విమర్శలు అర్ధ రహితం అని..బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా మేము గడీల్లో పడుకోలేదు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోయేదని..కానీ ఇప్పుడు జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రాను సిద్ధం చేశాం అని చెప్పారు.
ప్రజల మధ్య ఉంటూ ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం అని తెలిపిన భట్టి..అర్ధరాత్రిళ్లు కూడా పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందికి అభినందనలు చెప్పారు. నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తాం అని..వరద ఉదృతి తగ్గిన తర్వాత.. నష్టం అంచనా వేసి ప్రజలను ఆదుకుంటాం అన్నారు.