మాజీ మంత్రి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో హరీశ్ రావు కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రయత్నం చేశారని ఇది నిజం కాదా చెప్పాలని సవాల్ విసిరారు.
ఈ విషయం కేసీఆర్‌కు తెలుసని అందుకే ఆయన్ని దూరంగా పెట్టారని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్ తిట్టడం వల్ల హరీశ్ రావు వార్తలు మీడియాలో రాలేదని…అలాంటి హరీశ్ రావు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.
హరీశ్ రావు ప్రభుత్వం చేసిన ఆరోపణలు అన్ని అబద్దమని మండిపడ్డారు. బీఆర్ఎస్ సినిమా అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ ప్రస్తుతం నడుస్తోందని తెలిపారు. తాము పది మాసాలలో 22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు.
రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని, వాగులు, వంకలు, కొండలు, కొనలకు గత ప్రభుత్వం రైతుబంధు వేసిందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ కుల గణనకు అనుకూలమా? వ్యతిరేకమా? అని అన్నారు.