- Advertisement -
నటుడు మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా మరోసారి నోటీసులు జారీ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్ తెలిపారు.
తాను ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నానని మోహన్ బాబు అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరిగొచ్చిన తాను ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నానని కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మోహన్ బాబు తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
జర్నలిస్టు రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు కావడం తెలిసిందే. జర్నలిస్టు చేతిలో మైకు లాక్కొని తలపై బలంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు రంజిత్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకోగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి మోహన్ బాబు..రంజిత్‌ను పరామర్శించారు.