- Advertisement -
మందుబాబులకు షాక్.. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
చీప్ లిక్కర్ మినహాయించి.. రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. బాటిళ్లపై కనీసం రూ.50 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
త్వరలో చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు సమాచారం. ఇటీవలే తెలంగాణలో బీర్ల ధరలు 15 శాతం పెంచింది రేవంత్ సర్కార్.