Monday, May 5, 2025
- Advertisement -

తెలుగు సీఎస్‌ల భేటీ..కుదరని ఏకాభిప్రాయం!

- Advertisement -

విభజన అంశాలపై చర్చించేందుకు తొలిసారి తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో తొలిసారి ఇరు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారులు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఏపీలో తొలిసారి జరిగిన భేటీలో

ప్రధానంగా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లో సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించారు. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకం వంటివి సైతం చర్చకు వచ్చాయి. 9వ షెడ్యూల్లో 91 కార్పొరేషన్లు ఉండగా 23 కార్పొరేషన్లపై ఏటూ తేలలేదు. ఏపీఎస్ఆర్టీసీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో , ట్రాన్స్‌కో సంస్థల ఆస్తుల పంపిణీపై ఎవరి వాదనలు వారే వినిపించారు.

10వ షెడ్యూల్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, పోలీస్ అకాడమీ, ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో పాటు పలు కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.

తెలంగాణ నుంచి సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు హాజరు కాగా ఏపీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -