Friday, May 2, 2025
- Advertisement -

ఉగ్రదాడి..జగన్ నివాళి

- Advertisement -

ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళి అర్పించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవికదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు జగన్‌.

ఇక పహల్గంలో ఉగ్రవాదుల దాడులను ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు రేవంత్ రెడ్డి , ఇతర మంత్రులు ,అధికారులు.

మరోవైపు ఢిల్లీలోని పాక్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి, హైకమిషన్ వేడుకలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో వేలాదిగా అక్కడికి చేరుకొని ఎంబసీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. బారికేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులను నిలువరించారు పోలీసులు. దేశం మొత్తం పహల్గాం ఉగ్రదాడిపట్ల తీవ్ర ఆవేదనతో ఉంటే,పాక్ హైకమిషన్ లో ఒక ఉద్యోగి కేక్ తీసుకుని లోపలికివెళ్లడం సంచలనంగా మారింది.. అతని చుట్టుముట్టి ఏ సందర్భంలో కేక్ తో లోపలికి వెళ్తున్నారంటూ ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు ఆ వ్యక్తి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -