ఏపీలో అధికారం తమదంటే తమదని ఇటు వైసీపీ అటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఆ నేతలు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తే వారికి మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వరించే తొలి వ్యక్తి భరత్ అవుతారు. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబుపై భరత్‌ని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు.
ఇక ఆ తర్వాత వినిపిస్తున్న పేరు వంగా గీత. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ మీద పోటీ చేయగా ఆమె గెలిస్తే ఈసారి మంత్రి అవడం పక్కా అని తెలుస్తోంది. అలాగే కృష్ణా జిల్లాలో ఇద్దరు నానిలు కొడాలి నాని,పేర్ని నానికి కూడా బెర్త్ కన్ ఫర్మ్ అని టాక్ నడుస్తోంది. అయితే ఇందులో పేర్నీ నాని పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీ అయి మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీంతో పాటు విడదల రజనీ కూడా కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అని ప్రచారం జరుగుతోంది.
ఇక టీడీపీ తరపన యనమల రామక్రిష్ణుడు, నారా లోకేష్ లకు కీలక శాఖలు దక్కుతాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పిఠాపురం టీడీపీ నేత వర్మను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు ఉత్తరాంధ్రా నుంచి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోండగా అధికారంలోకి ఎవరు వస్తారో వేచిచూడాలి.