కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి ప్రయోగాలకు సిద్ధమవుతోంది టీమిండియా. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరు ఉంటారో అస్సలు ఉహించడం కష్టమవుతోంది. టీ20లు, వన్డేలు, టెస్టులు ఇలా ఒక్కో ఫార్మాట్‌లో కొంతమంది ఆటగాళ్లకు అవకాశం ఇస్తు గంభీర్ తన మార్క్ చూపిస్తున్నారు.
ఇక ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కొల్పోయిన టీమిండియా… బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19 నుండి టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా కొంతమంది ఆటగాళ్లు మాత్రం చివరి మ్యాచ్ ఆడి ఎన్నో రోజులు అవుతోంది.
పుజారా, అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాళ్లు. ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందించిన వారు. కానీ ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2022లో శ్రీలకంతో చివరి టెస్టు మ్యాచ్ ఆడగా తర్వాత మళ్లీ అవకాశం రాలేదు.
అలాగే అజింక్య రమానే చివరి సారిగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడాడు. భారత్ తరపున 85 టెస్టులు ఆడాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న పోటీ కారణంగా రహానేకు అవకాశం దక్కడం లేదు. ద్రావిడ్ తర్వాత భారత జట్టు వాల్‌గా పేరు తెచ్చుకున్నారు ఛటేశ్వర్. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పుజారా తన చివరి మ్యాచ్ ఆడగా ఆ తర్వాత జట్టులో మళ్లీ ఛాన్స్ దక్కలేదు.