ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పరువు పొగొట్టుకున్నారు. వాలంటీర్ వ్యవస్థపై వ్యంగ్యంగా మాట్లాడగా దీనికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు. డిప్యూటీ సీఎం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు..కనీసం జీవోలు చదవాలని చురకలు అంటించారు.
వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వ శాఖగా గుర్తిస్తూ 2020లో జీవో నెంబర్ 33 రిలీజ్ చేశాం అని..కూటమి ప్రభుత్వంలో వార్డు వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు ఒక మంత్రిని కూడా పెట్టారు అన్నారు. మంత్రి డోలా బాలవీరాంజనేయులకు కేటాయించిన శాఖల్లో వార్డ్, విలేజ్ వాలంటీర్ వ్యవస్థ కూడా ఉందని ఇది తెలుసుకోవాలన్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడి పరువు పోగొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలి వేస్తోందని మండిపడ్డారు.
చనిపోయిన వ్యక్తిని విచారణకి రమ్మంటారా అని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై గుడ్డిగా కేసులు పెడుతున్నారనేదానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? చెప్పాలని డిమాండ్ చేశారు.