Saturday, May 3, 2025
- Advertisement -

తప్పును ఎత్తి చూపితే కేసులా?

- Advertisement -

దళితులంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఏహ్య భావం ఉందన్నారు వైసీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ . పరిపాలించడం చేతకాక సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యేపై పోస్టు పెడితే, వాస్తవ పరిస్థితిని వివరిస్తే అది నేరమా? మీ తప్పును ఎత్తిచూపితే, మీ తప్పుడు ప్రచారంపై ప్రజలకు అవగాహన కలిగిస్తే తప్పా? చెప్పాలన్నారు.

సోషల్‌ మీడియా కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడం, తిట్టడం, కొట్టడం, అవమానించడం ఇప్పటికే మితిమీరిపోయిందన్నారు. ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం… దీన్ని దళితులుగా మేము వదిలిపెట్టం అన్నారు. రాజమండ్రిలో సాగర్‌పై జరిగిన దాడిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం అన్నారు సుధాకర్.

41A నోటీసులు ఇస్తామని పిలిచారు.. నన్ను బట్టలు విప్పి అర్థనగ్నంగా నిలబెట్టారు అన్నారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. సీఐ తనను ఇష్టం వచ్చినట్లు తిట్టారని… మళ్లీ పోస్టులు పెట్టకూడదని బెదిరించారు అన్నారు. వాళ్లే రాసుకున్న స్టేట్‌మెంట్‌ మీద నాతో బలవంతంగా సంతకాలు పెట్టించారు అని..రాజ్యాంగం మాకు కల్పించిన మాట్లాడే హక్కును ఎలా కాదంటారు అని ప్రశ్నించారు సాగర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -