Sunday, May 4, 2025
- Advertisement -

టీటీడీ సంచలన నిర్ణయం..అన్యమత ఉద్యోగులపై వేటు

- Advertisement -

టీటీడీ సంచలన నిర్ణయం తీసుకంది. అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు టీటీడీ అధికారులు. వీరు కూడా తిరుమల పవిత్రతను చెడగొడితే వారిపై కూడా వేటు వేసేందుకు రెడీ అవుతోంది. బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయు అయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్,లెక్చరర్లు, తదితరులు ఉన్నారు.

ఆలయాల ఆధ్యాత్మిక పరిశుభ్రతను కాపాడే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 1989 దేవాదాయ చట్టం ప్రకారం హిందూ మత విధానాలను పాటిస్తామని టీటీడీలో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. అయితే వీరు హిందూ మత ఉత్సవాల్లో పాల్గొంటూనే అన్య మతాలకు సంబంధించిన ఆచారాలలో కూడా పాల్గొంటున్నట్లు నిర్ధారణ అయింది.

TTD ఈవో జె. శ్యామలరావు ఈ సందర్భంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మెమోలను జారీ చేశారు. సంబంధిత ఉద్యోగులను TTD ఆలయాలు మరియు అనుబంధ శాఖల నుండి తొలగించి, హిందూ మత కార్యక్రమాలలో పాల్గొనకుండా నిషేధం విధించారు. అలాగే ఇకపై ఈ ఉద్యోగులను హిందూ మత పూజా విధులు, ఉత్సవాలు లేదా శోభాయాత్రలకు నియమించరాదని టీటీడీ తెలిపింది.

ప్రస్తుతం బదిలీ చేయగా భవిష్యత్‌లో ఇలాంటి ప్రవర్తనే కొనసాగితే మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవానికి దేవాదాయ శాఖ చట్టం ప్రకారం టీటీడీలో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగులుగా నియమించాల్సిన నిబంధన ఉంది. అయితే చట్టాన్ని మూడు సార్లు సవరించి ఆలయ బోర్డు మరియు అనుబంధ సంస్థల ఉద్యోగులు హిందూ మతాన్ని తప్పక అనుసరించాలనే నిబంధనను చేర్చారు. దీంతో అన్యమతస్తులు ఆలయాల్లో పనిచేసే అవకాశం లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -