Sunday, May 4, 2025
- Advertisement -

చంద్రబాబు చేసింది మోసం..చెప్పింది అబద్దం!

- Advertisement -

సూపర్‌ సిక్స్‌ అంటూ చంద్రబాబు ప్రజలకు చేసింది మోసం…చెప్పింది అబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి,చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త విడుదల రజిని. ఇందుకు చంద్రబాబు మీద 420 కేసు పెట్టకూడదా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కాదా?, ఈ విషయంపై నేను, నా ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతారు. చంద్రబాబు మోసంపై ప్రతి ఒక్కరూ ట్వీట్ పెట్టాలని పిలుపునిస్తున్నా..ఎంత మందిని అరెస్ట్‌ చేస్తారో చూద్దాం..అరెస్ట్‌ చేయాలనుకుంటే నా దగ్గర నుంచే మొదలు పెట్టాలని సవాల్ విసిరారు.

మూడు ఫేజ్‌లలో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారని, మొదటి ఫేజ్‌లో 2023-24లో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించాం.. రెండో ఫేజ్‌లో పూర్తి కావాల్సిన 5 మెడికల్‌ కాలేజీలు నిర్మాణం పూర్తి కావొస్తున్నాయి అన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ వద్దంటూ ఎన్ఎంసీ కి లెటర్‌ రాసిన ఘోరమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన పథకం ఆరోగ్యశ్రీ… వైయస్ జగన్‌ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి ఎన్నో మెరుగులు దిద్ది మరింత బలోపేతం చేశాం అన్నారు. అలాంటి గొప్ప సేవలన్నిటిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని… ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది. ఇంటింటికీ వైద్యాన్ని అందించే ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలనూ లేకుండా చేసిందన్నారు.

వైయస్‌ జగన్‌ హయాంలో కాల్ చేసిన 15ని.ల్లో 108 వచ్చేది.. కూటమి ప్రభుత్వంలో గంటకు కూడా రావడం లేదు అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై బురద వేసే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తుంది కూటమి సర్కార్ అన్నారు. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు వైయస్ జగన్ ఎన్నో వైద్య సంస్కరణలు తీసుకొచ్చారు.. కానీ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని సంస్కరణలనీ అటకెక్కించేసిందన్నారు. సూపర్-6 హామీల అమలు గురించి ప్రశ్నిస్తుంటే.. కేసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు…ఆ కేసులకి మేము భయపడం.. ధైర్యంగా ఎదుర్కొంటాం అని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -