కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? అని ప్రశ్నించారు ఎంపీ విజయసాయి రెడ్డి. అఫిషియల్ హ్యాండిల్‌లో ఒకవైపే చూపించి ప్రజల్ని పక్కదోవ పట్టించే ఎత్తుగడ చేస్తున్నారన్నారు. వైయస్ జగన్ ని రాజకీయాల్లో లేకుండా చేసేందుకు వరుసగా కుట్రలు జరుగుతున్నాయని ప్రజలకి వాస్తవాలను తెలిపే బాధ్యత తమపై ఉందన్నారు.
పెళ్లి అయిన 20 ఏళ్ల తర్వాత చెల్లి షర్మిలమ్మని పిలిచి రూ.200 కోట్లని జగన్ ఇచ్చారన్నారు. దేశంలో ఇలా ఒక చెల్లి మీద ప్రేమతో ఇచ్చిన అన్న ఎవరైనా ఉన్నారా? చెప్పాలన్నారు విజయసాయి రెడ్డి. అన్న ప్రత్యర్థితో చేతులు కలిపి ఏ చెల్లి అయినా ద్రోహం చేస్తుందా? చెప్పాలన్నారు.
తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవటానికే ప్రెస్మీట్ పెడుతున్నా అని షర్మిలమ్మ అంటున్నారు…కానీ చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం చేస్తున్నారు అని విమర్శించారు.
ఇది ఆస్తి తగాదా కాదు…అధికారానికి సంబంధించిన తగాదా అన్నారు. అన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదనే అజెండాతో షర్మిలమ్మ పనిచేస్తున్నారు అని విమర్శించారు.