తిరుమల వెంకన్న సాక్షిగా ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయాయి రెడ్డి..కూటమి ప్రభుత్వ రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీకి సహకరించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం సరికాదన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కుటుంబం నుండి పైకి వచ్చిన వాడినని..బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే వాడిని కాదన్నారు. ఒక ఆదివాసీ మహిళతో సంబంధం అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణ చెప్పిస్తానని వెల్లడించారు.
పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని తెలిపారు.రాధాకృష్ణ,బీఆర్ నాయుడు, వంశీకృష్ణ మాదిరి తాను కాదన్నారు విజయసాయి రెడ్డి. అన్ని హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేస్‌తానని తెలిపారు. నా మీద కుట్ర పన్నిన వంశీకృష్ణను వదిలే పరిస్థితి లేదన్నారు. వంశీకృష్ణ వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఆ ఆదివాసి మహిళే విజయసాయిరెడ్డి తనకు తండ్రిలాంటి వాడని చెప్పిందని వెల్లడించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ.