Saturday, May 3, 2025
- Advertisement -

విజయసాయి.. రాజకీయాలకు గుడ్ బై

- Advertisement -

రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. జనవరి 25న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌లో ఏ రాజకీయ పార్టీలో చేరబోనని.. లాభం లేదా ఆర్థిక ప్రయోజనం ఆశించి రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు.
నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను

ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది…. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పుకొచ్చారు. నాలుగు దశాబ్దాల పాటు తనకు అండగా నిలిచిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.

జగన్‌కి దేవుడు మంచి ఆరోగ్యం, విజయాలు, శాశ్వతమైన ఆనందం అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీకి, రాష్ట్రానికి మేలు కలిగే విధంగా నిస్వార్థంగా, నిజాయితీతో, ఎటువంటి రాజీ లేకుండా కష్టపడి పనిచేశాను అన్నారు.

కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాలు కొనసాగించి, రాష్ట్రానికి ప్రయోజనాలు సాధించేందుకు నా వంతు పాత్రను పోషించాను… గత తొమ్మిదేళ్లుగా నాకెంతో బలాన్ని, గుర్తింపును ఇచ్చిన మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, అమిత్ షా కి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. తెలుగుదేశం పార్టీతో నాకు రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా, చంద్రబాబుతో మరియు వారి కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు లేవు. పవన్ కళ్యాణ్ తో నా స్నేహం ఎప్పటికీ ఉంటుందన్నారు.

భవిష్యత్తులో నా దృష్టి వ్యవసాయం మీదే ఉండనుందని.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనకు మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు, మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు విజయసాయి రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -