చంద్రబాబే ఓ క్రిమినల్…. కేవీరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా అని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్‌పై కక్ష తీర్చుకోవడమే టార్గెట్‌గా టీడీపీ పనిచేస్తుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు…మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబుకు ఇప్పుడు ఏపీ సంక్షేమం కంటే జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ముఖ్యమైపోయిందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం అన్నారు. ప్రతీరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి.
ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు. కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టింది చంద్రబాబేనని… కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కేవీరావుకు అన్యాయం జరిగిఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించొచ్చు అన్నారు. ఒకవేళ కేవీరావుకు ఫోన్ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా?. బ్రోకర్ పనులు చేసే కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా?…తనపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి?చెప్పాలని డిమాండ్ చేశారు.