Sunday, May 4, 2025
- Advertisement -

విశాఖ ఉక్కు..చంద్రబాబును నమ్మమంటున్న కార్మికులు!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు ఉక్కు పరీక్షను ఎదుర్కొనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పలు మీటింగ్‌లలో చంద్రబాబుతో పాటు పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్మికుల ఆగ్రహానికి భయపడి కంటితుడుపు చర్యగా శిబిరం వద్దకు వచ్చి కపట హామీలిచ్చారు టీడీపీ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ.

అయితే వారిని నమ్మమని తెగేసి చెప్పారు కార్మికులు. నిజాయితీ ఉంటే స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కేబినెట్‌లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలని కార్మికులు డిమాండ్ చేశారు. అంతేగా గాజువాకలో మహాధర్నాకి పిలుపునిచ్చారు కార్మికులు.

ఇక ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమలో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయగా శాశ్వత‌ ఉద్యోగుల‌కు వాలంట‌రీ రిటైర్మెంట్ ఇస్తున్నారు. దీనిని కూడా కార్మిక సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. బ‌ల‌వంతంగా వాలంట‌రీ రిటైర్మెంట్ చేయిస్తున్నారంటూ మండిపడుతున్నారు కార్మికులు. దీంతో ఇప్పుడు విశాఖ ఉక్కు వ్య‌వ‌హారం…కూట‌మి స‌ర్కారుకు అగ్ని పరీక్షగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -