ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబును అడుగడుగునా అడ్డుకున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు. దీనికి కారణం పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరిగిన సభలో నాగబాబు చేసిన కామెంట్సే కారణం.
పవన్ కళ్యాణ్ ఎవరి దయవల్ల పిఠాపురంలో గెలవలేదని… ప్రజల మద్దతుతోనే సాధ్యమైందన్నారు. ఎవరికైనా వేరుగా అనిపిస్తే, అది వారి కర్మ (భ్రమ) అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించడమే కాదు జనసేన-టీడీపీ మధ్య దూరాన్ని పెంచింది.
ఏప్రిల్ 4న నాగబాబు గోలప్రోలు లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొనగా టీడీపీ కార్యకర్తలు “వర్మ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఏప్రిల్ 5న ఇవాళ పర్యటించిన సమయంలోనూ టీడీపీ శ్రేణులు పసుపు జెండాలు ప్రదర్శిస్తూ నాగబాబును అడ్డగించారు.
ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. పిఠాపురం ప్రజల్లో మంచి ఆదరణ పొందిన ఆయన, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి పొత్తులో భాగంగా పవన్ పిఠాపురం నుండి పోటీ చేయడంతో వర్మకు సీటు దక్కలేదు. అయితే పవన్‌ను గెలిపించడంలో వెనక్కి తగ్గలేదు.అయితే ప్రస్తుతం ఆయనకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటా అన్నది ఆసక్తికరంగా మారింది.