ఆడాలా వద్దా అనేది ధోనీ ఇష్టం : రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్

- Advertisement -

భారత జట్టు మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై రవిశాస్త్రి స్పందించాడు. క్రికెట్ మళ్లీ ఆడాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ధోనీయేనని రవిశాస్త్రి అన్నారు. వరల్డ్ కప్ తర్వాత ఆర్మీకి సేవ చేసేందుకు రెండు నెలలు విరామం తీసుకున్నాడు ధోనీ. ఈ విరామంలో వెస్టిండిస్, దక్షిణాప్రికా పర్యటనలకు ధోనీ దూరమయ్యాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ “ధోని తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే అది అతడే నిర్ణయించుకోవాలి. వరల్డ్‌కప్ తర్వాత నేను ధోనీని కలవలేదు” అని చెప్పాడు.

- Advertisement -

అంతేకాకుండా.. “అతడు గనుక ఆసక్తిగా ఉంటే.. ఆ విషయంను ఖచ్చితంగా సెలక్టర్లకు తెలియజేస్తాడు. గొప్ప ఆటగాళ్ల జాబితాలో ధోని ఒకడు” అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక సాహా గాయపడటం వల్లే టెస్టుల్లో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు అని రవిశాస్త్రి తెలిపారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...