ఇప్పుడు ఏపీలో అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. రికార్డు స్థాయిలో పోటింగ్ నమోదు కావడంతో ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉందో అంతు చిక్కడం లేదు. అయితే పొలిటికల్ పార్టీలు మాత్రం గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటికే గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని చెప్పగా ఈసారి కూటమిదే అధికారం అని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు.
ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీ,బిజీగా గడిపిన నేతలంతా ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండగా ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. అభ్యర్థుల మెజార్టీ, ఏ పార్టీ గెలుస్తుంది అన్న దానిపై కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
వాస్తవానికి ఏపీలో ఎన్నికల గురించి ఇంత పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చిన చరిత్ర లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. కీలక నేతల నియోజకవర్గాలను ఇరు పార్టీల నేతలు టార్గెట్ చేయడం ఈ ఎన్నికలపై మరింత ఆసక్తిని పెంచగా గెలుపు ఎవరిని వరిస్తుంది అన్నది మాత్రం సందిగ్దంగానే ఉంది.