Saturday, May 3, 2025
- Advertisement -

రవీంద్రనాథ్.. హ్యాట్రిక్ కొట్టేనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాలకు ఇంకా 6 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా. ఎవరు గెలుస్తారు అన్న దానిపై చర్చ ఆగడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యంగా కడప జిల్లా కమలాపురంలో గెలుపు ఎవరిది అనే దానిపైనే అంతా ఆతృతగా ఎదరుచూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుండి సీఎం జగన్ మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండుసార్లు వైసీపీ నుండి విజయం సాధించిన రవీంద్రనాథ్ రెడ్డి ఈ సారి హ్యాట్రిక్ కొడతారా లేదా టీడీపీ నుండి పోటీ చేసిన పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి విజయం సాధిస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. అంతేగాదు జగన్ సొంత జిల్లా కావడంతో ప్రజలంతా తనవైపే ఉన్నారని చెబుతున్నారు. వాస్తవానికి కమలాపురం కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత ప్రజలు జగన్‌ పార్టీకి ఓటేస్తూ వస్తున్నారు.

టీడీపీ నుండి పుత్తా నరసింహారెడ్డి తనయుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి బరిలో నిలిచారు. పుత్తా నరసింహారెడ్డి నాలుగుసార్లు ఇక్కడి నుండి పోటీ చేసి ఓటమిపాలు కాగా ఈసారి ఆయన తనయుడిని ఎన్నికల బరిలో దింపారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా తన తండ్రి పోటీచేసి ఓడిపోయిన సానుభూతితో ఈసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న చైతన్య రెడ్డి . ఈ సారి 84.44 పోలింగ్ శాతం నమోదుకావడంతో ఇది ఎవరి విజయానికి బాటలు వేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -