Saturday, May 3, 2025
- Advertisement -

చంద్రబాబుకు ఓటమా..భారీ మెజార్టీనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల సమరం ముగిసి వారం రోజులు గడుస్తున్న గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ వైసీపీ గతంలో గెలిచిన 151 స్థానాలకంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ప్రకటించగా టీడీపీ సైతం కూటమిదే గెలుపని చెబుతున్నారు. అయితే ఏ పార్టీ గెలుస్తుందా అన్న సంగతి పక్కన పెడితే కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా చర్చ జరుగుతోంది.

కుప్పంలో ఈసారి బాబు ఓడిపోతున్నారని వైసీపీ నేతలు తేల్చి చెబుతుండగా టీడీపీ నేతలు మాత్రం లక్ష మెజార్టీ వస్తుందని చెబుతున్నారు. 1983లో టీడీపీ స్థాపించినప్పటి నుంచి కుప్పం ఆ పార్టీకి కంచుకోటే. ఇక్కడ టీడీపీ తప్ప మరే పార్టీ విజయం సాధించలేదు. చంద్రబాబు వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు.

ఇక ఈసారి వైనాట్ కుప్పం టార్గెట్‌గా వైసీపీ విస్తృత ప్రచారం చేసింది. బాబును ఓడించేందుకు వైసీపీ బీసీ వర్గానికి చెందిన భరత్‌ని రంగంలోకి దింపింది. ఈ నియోజకవర్గం నుంచి భరత్‌ని గెలిపిస్తే కేబినెట్‌లో స్థానం కల్పిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా పాలేరు ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ముందు కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు వచ్చేలా చేసింది. కుప్పం బాధ్యతలను తనకు నమ్మకస్తుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డి కూడా తన సొంత నియోజకవర్గమైన పుంగనూరు కంటే కుప్పంపై దృష్టి సారించారు.

ఈసారి కుప్పంలో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ నమోదుకావడంతో ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వైసీపీ దెబ్బకు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో పలుమార్లు పర్యటించారు చంద్రబాబు. గత ఎన్నికల్లో చంద్రబాబు 30,722 ఓట్ల తేడాతో గెలవగా ఈసారి మాత్రం గట్టి పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా గెలుపు ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -