ఏపీ ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మేరుగ నాగార్జున,వెంకటరమణ, పేర్ని నాని గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలింగ్ రోజు, తర్వాత టీడీపీ వాళ్లు హింసకు పాల్పడ్డారని…కొంతమంది పోలీసులు పక్షపాత ధోరణితో ఏకపక్షంగా వారికి కొమ్ముకాశారని ఆరోపించారు. కొంతమంది పోలీసు అధికారులు ఏకంగా పచ్చచొక్కాలు వేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా…తెలుగుదేశం పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, ఆయన కాల్ డేటాను బయటకు తీయాలన్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారిని నియమించాలని కోరారు. వైసీపీ నేతలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలు వెల్లడించారు.