Sunday, May 4, 2025
- Advertisement -

వైసీపీ ప్రశ్నలు..టీడీపీ ఉక్కిరిబిక్కిరి!

- Advertisement -

శాసనమండలిలో వైసీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీపం – 2 అంటే ఒక్క సిలెండర్‌ ఇవ్వడమా? చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.

ప్రభుత్వం చెప్పిన బ్లాక్‌ పిరియడ్ ప్రకారం చూసినా రెండు సిలెండర్లు ఇవ్వాల్సి ఉందని…దీపం పథకం లబ్దిదారులు ఎంత మంది అంటే సమాధానం చెప్పలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. లబ్దిదారులు ఎందరో తెలియకుండా పథకం అమలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? అని ఎద్దేవా చేశారు.

ఇండస్ట్రియల్ పాలసీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ ఇస్తున్నారా లేదా అని అడిగితే కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అన్నారు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి పారిశ్రామిక విధానంలో రూల్‌ ఆఫ్ రిజర్వేషన్‌ అమలు చేసింది వైయస్ఆర్ అని గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో రాయితీలు కూడా ఇచ్చారు.

ప్రభుత్వ భూములో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూల్‌ ఆఫ్ రిజర్వేషన్‌ ప్రకారం ఎలాట్‌ చేయాలి 25 ఏళ్లుగా ఈ చట్టం అమలు అవుతుంటే.. కూటమి ప్రభుత్వం దీన్ని పాటించడం లేదు అని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -