Saturday, May 3, 2025
- Advertisement -

డయేరియా బాధిత కుటుంబాలకు బెదిరింపులా?

- Advertisement -

డయేరియాతో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం అన్నారు వైసీపీ అధినేత జగన్. మీడియాతో మాట్లాడిన జగన్…ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం అన్నారు. ప్రతి కుటుంబానికీ రూ.2 లక్షలు అందిస్తాం…డైవర్షన్ పాలిటిక్స్ ఆపి ప్రజలకు క్షమాపణ చెప్పి సహాయం అందించాలని డిమాండ్ చేశారు జగన్. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని పైనున్న దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో గ్రామ స్వరాజ్యం తెచ్చాం అన్నారు. ఈరోజు గ్రామాల్లో మంచి నీళ్లు కలుషితం అయ్యి ప్రజలు చనిపోతున్నారు…జగన్‌ ట్వీట్‌ చేస్తే తప్ప ఆ మరణాలపై ప్రభుత్వం స్పందించలేదు అన్నారు. జగన్‌ ప్రశ్నిస్తే తప్ప 14 మంది మరణించారని ఒప్పుకోలేదు అన్నారు. ఏ పొరపాటు జరిగినా దాన్ని కవర్‌ చేసుకోవాలనే ఆలోచిస్తోంది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అన్నారు.

డయేరియా బాధితులను అంబులెన్స్‌తో సమీపంలో ఉన్న విజయనగరం హాస్పటల్‌కి కూడా తీసుకువెళ్లలేకపోయారు…గ్రామీణ ప్రజల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు అన్నారు. నాడు నేడు స్కూళ్లలో బెంచీల మీద పేషెంట్లను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారంటే సిగ్గుపడాలన్నారు. డయేరియా వల్ల మరణించినట్టు చెప్పవద్దని బాధితుల కుటుంబాలను బెదిరించడం దారుణం…డయేరియా మరణాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. 100 రోజుల్లోనే ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -