- Advertisement -
తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40 మందికి పైగా గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. వెంటనే అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చనిపోయిన వారిలో విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు ఉన్నారు.