Saturday, May 3, 2025
- Advertisement -

బడ్జెట్‌లో కేటాయింపులు గుండు సున్నా: జగన్

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్. వైసీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన జగన్‌.. ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు.. కరపత్రాలు కూడా పంచారు. బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా అంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం బడ్జెట్ పై జగన్ విమర్శలు చేశారు.

గవర్నర్‌కు ఇచ్చిన పుస్తకం లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సచివాలయం పని చేసేందుకు లక్ష30 వేల మందికి, గ్రామ వాలంటీర్లుగా రెండు లక్షలు, అప్కాస్ ద్వారా 90 వేల పైనే ఉద్యోగాలు ఇచ్చాం అని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో 6 లక్షల 30వేల మందికిపైనే ఉద్యోగాలు ఇచ్చామ‌ని వెల్లడించారు.

రైతులను కూడా కూటమి ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని..పీఎం కిసాన్ కు సంబంధం లేకుండా సంవత్సరానికి 20వేలు ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని మండిపడ్డారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బడ్జెట్ లలో రైతులకు 40వేలు బాకీ ఉన్నారు. 50 సంవత్సరాలు నిండిన మహిళలకు 45వేలు ఇస్తామని చెప్పారు. రెండు సంవత్సరాలకుగాను కలిపి 50 సంవత్సరాల మహిళలకు 90వేలు బాకీ ఉన్నారు అంటూ కూటమి ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు.

18సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు రూ.18వేలు ఇస్తామ‌ని చెప్పారు. ఈ హామీ ఎమైంది బాబు..? సమాధానం చెప్పాలి అంటూ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్రతి మహిళకు చంద్రబాబు 36 వేలు బాకీ ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు.. రాష్ట్ర మొత్తం మహిళలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మహిళలకు సమాధానం చెప్పాలి. స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15 వేలు అన్నారు. ఎంత మంది ఉంటే అన్ని‌ 15 వేలు అంటూ ఊరుఊరు ఊద‌ర‌ కొట్టారు. ఇది ఏమైందో చంద్రబాబు విద్యార్థుల‌కు సమాధానం చెప్పాలని జ‌గ‌న్ ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -