ఈనాడు..టిష్యూ పేర్!

ఈనాడు పై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..ఈనాడు టిష్యూ పేపర్ కన్నా దిగజారిందని మండిపడ్డారు. SECIతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పు సమాచారం ప్రచారం చేస్తున్నదని జగన్ ఆరోపించారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA)పై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఈనాడు పత్రికను టార్గెట్ చేస్తూ…ఈనాడు టాయిలెట్ పేపర్ కంటే ఎక్కువ, టిష్యూ పేపర్ కంటే తక్కువ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

SECI (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో 2021, డిసెంబర్ 1న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసిందని స్పష్టం చేసిన జగన్, ఈ ఒప్పందానికి సంబంధించి SECI CMD రమేశ్వర్ ప్రకాశ్ గుప్తాను కేంద్రం తొలగించిందనే ఈనాడు ఆరోపణ పూర్తిగా నిరాధారం అని ఖండించారు. ఎందుకంటే గుప్తా 2023లోనే CMD బాధ్యతలు చేపట్టారని తెలిపారు.

టిడిపి ప్రభుత్వం చేసిన విద్యుత్ ఒప్పందాల్లో రూ. 11,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం విద్యుత్‌ను ₹4.60 యూనిట్ ధరకు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసిందని, అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం SECIతో ₹2.49 యూనిట్ మాత్రమే చెల్లించే ఒప్పందం చేసిందని తెలిపారు. ఇది దేశంలోనే తక్కువ రేట్లలో ఒకటని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹3,587 కోట్లు, మొత్తం 25 ఏళ్లలో ₹89,675 కోట్లు ఆదా అవుతుందని వివరించారు.