- Advertisement -
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ బలోపేతం దిశగా కమిటీలను ఏర్పాటు చేస్తూ వస్తున్న జగన్ తాజాగా మరో డిసిషన్ నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కుమారుడు ముద్రగడ గిరికి ప్రమోషన్ ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరిని నియమించారు జగన్. ఈ మేరకు వైసీపీ కేంద్రకార్యాలయం కీలక ప్రకటన చేసింది.
కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత ముద్రగడ పద్మనాభం. కాంగ్రెస్,టీడీపీలో కీలక నేతగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ముద్రగడ.
ప్రస్తుతం వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండగా ఆయన స్థానంలో ముద్రగడ గిరికి బాధ్యతల్ని అప్పగించారు జగన్.