మళ్లీ అధికారం మనదేనని..కార్యకర్తలెవరూ అధైర్య పడవద్దన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. పులివెందులలో పర్యటించిన జగన్…పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చామన్నారు. చెప్పిన మంచి పనులన్ని చేశామని…రాష్ట్రంలో ప్రతీ కుటుంబంలో మనం చేసిన మంచి ఉందని తెలిపారు.
కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. అందరి కలిసి కట్టుగా ముందుకు సాగుదామని…ప్రతి కార్యకర్తకు పార్టీ తోడుంటుందని తెలిపారు. కష్టకాలంలో ప్రతి కార్యకర్తకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని సూచించారు. భవిష్యత్ మనదేనని భరోసా ఇచ్చారు జగన్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని…ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందామని సూచించారు.
ఇక పులివెందులలో జగన్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున జగన్‌ను కలిసేందుకు ప్రజలు తరలివస్తుండగా ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించారు జగన్.