వైసీపీ కార్యకర్తలను వేధించిన వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టం చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో సమావేశమయ్యారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలనే అని తేల్చిచెప్పారు.
ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా… మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలనే అని తేల్చిచెప్పారు. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్‌ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడుకుందాం అన్నారు జగన్.
కార్యకర్తలకు అన్నలా ఉంటా అని భరోసానిచ్చారు జగన్. జగన్ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం అన్నారు. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం అన్నారు. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేక పోయామని.. వచ్చే జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు అన్నలా అండగా ఉంటామని తేల్చిచెప్పారు. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని జగన్ అన్నారు.