వైఎస్ ఫ్యామిలీ మాట ఇస్తే మడమ తిప్పని నైజం, విశ్వసనీయ రాజకీయాలకు పెట్టింది పేరు. మాట ఇచ్చే ముందు ఆలోచిస్తారేమో కానీ ఒక్కసారి మాట ఇచ్చాక వెనకడుగు వేయరు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ఫ్యామిలీ అంటే అందరికి గుర్తొచ్చేది. తండ్రి వైఎస్ బాటలోనే నడుస్తు అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు జగన్.
నవరత్నాల హామీలతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్…వాటన్నింటిని నెరవేర్చారు. అంతేగాదు తనతో పాటు రాజకీయ ప్రయాణంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్న వారిని వైసీపీ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. అయితే ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి రావడంతో వ్యక్తిగత దాడులతో పాటు ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రొత్సహిస్తున్నారు.
అయితే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు జగన్. పార్టీ వీడి వెళ్లేవారిని ఆపేది లేదు…తనవెంట ఉన్న వారిని కాదనేది లేదు అన్న క్లారిటీతో ముందుకు సాగుతున్నారు. అందుకే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఇప్పుడు ఓటమి పాలయిన తర్వాత పార్టీని విడిచి వెళ్లుతున్న వారి విషయాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు.అందుకే పార్టీని వీడి వెళ్లిపోతున్న వారిని బుజ్జగిస్తామని చెబుతున్నా జగన్ నిర్మోహమాటంగా నో చెప్పినట్లు తెలుస్తోంది. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికి అయినా కట్టుబడి ఉండాలి తప్ప సొంత నిర్ణయాలు అమలు కావని నేతలతో చెప్పేశారట జగన్.
ఎవరు పార్టీ వదిలి వెళ్లినా పెద్దగా పట్టించుకోవాల్సిన అసవరం లేదని, తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత తనదని చెబుతున్నారట జగన్. పార్టీ ఆదరించిన వాళ్లు వెళితే ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్న జగన్…త్వరలో ప్రజాక్షేత్రంలో టీడీపీ వైఫల్యాలను ఎండగట్టేకుందు రెడీ అవుతున్నారట.