Saturday, May 3, 2025
- Advertisement -

సంక్రాంతి తర్వాత జిల్లాలకు జగన్

- Advertisement -

సూపర్-6 పథకాలు ఎలా ఉన్నాయని.. హలో అంటూ ఫోన్ చేసి అడుగుతారంట.. అసలు పథకాలు ఉంటే కదా ప్రజలు సమధానం చెప్పడానికి? అని విమర్శించారు మాజీ సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశంలో మాట్లాడిన జగన్…రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. ప్రభుత్వ ఖజానాకి రూపాయి కూడా ఆదాయం రావడం లేదు.. వేలం వేసి మరీ బెల్టు షాపులు నడుపుతున్నారు అని మండిపడ్డారు. సంక్రాంతి తర్వాత తాను కూడా జిల్లాల్లో పర్యటిస్తాను అని వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకి కూటమి నేతలు చెప్తున్న అబద్ధాల్ని ఎదుర్కోవాలంటే.. మనం కూడా ఏదో ఒకటి చెప్దామని నాతో కొంత మంది నాయకులు చెప్పారు
కానీ.. నేను ఒప్పుకోలేదు అన్నారు. ఆరునెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదు అన్నారు.రాష్ట్రంలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయి….
వైద్యరంగం పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.

వ్యవసాయ రంగం కుదేలైంది..విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా రాజ్యం ఏలుతుందన్నారు. నియోజకవర్గాల్లో మైనింగ్ సహా ప్రతిదానికి ఎమ్మెల్యేలకు మామూళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని…తొలిసారిగా మేనిఫెస్టోలో హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం అని తెలిపారు జగన్. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే సంక్షేమ కేలండర్ ఇచ్చాం అని…మనం కుటుంబం మొత్తానికి సహాయం చేశాం అన్నారు.

టీడీపీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్దాలు చెప్పారు అని విమర్శించారు. సంక్రాంతి తర్వాత నేను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటిస్తాను..ప్రతి బుధవారం, గురువారం కార్యకర్తలతో మమేకం అవుతాను అన్నారు. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం పేరుతో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ లోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలని..ప్రతి కార్యకర్తకు ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలన్నారు. గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -