Wednesday, May 7, 2025
- Advertisement -

టార్గెట్ అచ్చెన్న..గేమ్ షురూ!

- Advertisement -

రెండోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగా ఓ వైపు వైసీపీ సులువుగా గెలిచే స్థానాల్లో మెజార్టీ పెంచేలా చర్యలతో పాటు మరోవైపు టీడీపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు స్థానాలు, అలాగే కీలక నేతలపై ఫోకస్ చేశారు జగన్. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపై ఈసారి పట్టు సాధించాలని కసితో ఉన్న జగన్‌…ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. శ్రీకాకుళం ఎంపీ స్థానంతో పాటు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడిని ఓడించేందుకు పావులు కదుపుతున్నారు.

వాస్తవానికి వైసీపీ తరపున టెక్కలి నుండి పోటీ చేసేందుకు చాలా మంది పోటీపడుతున్నారు. ప్రస్తుతం టెక్కలి ఇంఛార్జీగా దువ్వాడ శ్రీను సతీమణి వాణి ఉన్నారు. ఈమె పేరుతో పాటు కేంద్ర మాజీమంత్రి శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి పేరును పరిశీలిస్తున్నారు జగన్. ప్రధానంగా కృపారాణి పేరే వినిపిస్తోంది. ఆమెకు టికెట్ ఇస్తే అచ్చెన్నను ఓడించడం ఈజీ అవుతుందని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు.

వాస్తవానికి టెక్కలిలో అచ్చెన్నపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అచ్చెన్న కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కృపారాణిని బరిలో దించితే ఆమె గెలుపు నల్లేరుపై నడకే కానుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి తొలుత కృపారాణిని ఎంపీగా బరిలోకి దించాలని భావించినా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తేనే లాభం ఉంటుందని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని త్వరలోనే దీనిపై ప్రకటన రానుందని తెలుస్తోంది.

2009లో శ్రీకాకుళం నుండి ఎర్రన్నాయుడిపై పోటీ చేసి గెలిచారు కృపారాణి. ఇప్పుడు తమ్ముడు అచ్చెన్నాయుడిని ఓడించి అన్నాదమ్ముళ్లను ఓడించిన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -