ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. జగన్ విదేశీ పర్యటనకు సంబంధించిన సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో విదేశాలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు జగన్. సెప్టెంబర్ మూడు నుండి 25 వరకు యుకేలో పర్యటించనున్నారు. తన కూతురు బర్త్ డే వేడుకల్లో పాల్గొననున్నారు జగన్.
ఇందుకు సంబంధించి సీబీఐ కోర్టులో అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 3న యుకేకు వెళ్లనున్నారు జగన్. అయితే విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను ముందే వెల్లడించాలని న్యాయస్థానం సూచించింది.
ఈ ఏడాది జగన్ విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జగన్ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనకు ముందే పార్టీలో అనుబంధ సంఘాలకు అధ్యక్షులను జగన్ నియమించారు. సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక బాధ్యతలను అప్పజెప్పారు జగన్.