Saturday, May 3, 2025
- Advertisement -

కార్పొరేటర్‌కు ఎక్కువ..ఎమ్మెల్యేకు తక్కువ!

- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్ చేశారు మాజీ సీఎం జగన్‌. పవన్‌ జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడని, ఆయన తీరును చూస్తుంటే కార్పొరేటర్‌ ( కు ఎక్కువ.. ఎమ్మెల్యే కు తక్కువ అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వైసీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన జగన్‌… ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నడుస్తుంది. పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు చేస్తుంది ఏమిటి.? అంటూ జగన్ ప్రశ్నించారు. నా మాటలు న్యాయమూర్తులు కానీ, గవర్నర్ కానీ వింటుంటే అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబును తొలగించాలి అన్నారు.

వైసీపీ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ సభ్యులు ఐదుగురు పక్కన కూర్చుంటాం అన్నారని, 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దాం అన్నారని, అయితే తాను వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానని స్పష్టం చేశారు.

ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రభుత్వంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి రెండూ ఉంటాయని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడూ అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ మీరే చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -