- Advertisement -
కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్… దేశంలో మొదటిసారిగా బీసీల లెక్కలు చేసింది తామేననని గుర్తు చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు, పేదలకు కులగణన ద్వారా న్యాయం జరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
జన గణనతో పాటే కుల గణన చేయాలన్న కేంద్రం నిర్ణయం సహేతుకమన్నారు. 2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం అన్నారు.
కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది ఇది కీలకమైన అడుగు అన్నారు.
