పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం జగర్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ క్రిస్టియన్ సామాజికవర్గం నేతలు నిరసనలు చేపట్టారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో నుంచి బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై రాజమహేంద్రవరానికి ప్రయాణిస్తుండగా, ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు.