చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయి!

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయసాయి రెడ్డి లొంగిపోయారని విమర్శించారు మాజీ సీఎం జగన్. మీడియాతో మాట్లాడిన జగన్… గతంలో లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్‌ మీద ఉంది నిజం కాదా అని నిలదీశారు. తమ అనుచరులను బెదిరించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్‌ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఒక్కదానిని కూడా నెరవేర్చలేదన్నారు.

అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్‌ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించి కలెక్టర్లను కలిసి హామీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తామని తెలిపారు. లిక్కర్ స్కాం జరగలేదని… మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు.

అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారని, ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో గల్లీగల్లీకి బెల్ట్‌షాపులు వెలిశాయని దుయ్య బట్టారు. బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయకుండా మద్యాన్ని డెలివరీ చేస్తున్నారని విమర్శించారు.