ఏపీలో దోచుకో, పంచుకో, తినుకో పాలన సాగుతోందన్నారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్.. సూపర్ సిక్స్ పథకాల ఊసే లేదు అన్నారు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థత టీడీపీ ప్రభుత్వానిదన్నారు.
అయిదు నెలలు గడుస్తున్నా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని దుయ్యబట్టారు. ప్రజలు నిలదీస్తారని భయపడి.. కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. ఇసుక, మద్యం, ఎక్కడ చూసినా దోపిడియే….కప్పం కట్టనిదే పనులు జరగడం లేదు అన్నారు. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చాక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.
రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది…మద్యంలోనూ చంద్రబాబు మాఫియా కొనసాగుతోందని మండిపడ్డారు. .రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే అందులో 14 డిస్టిలరీకి లైసెన్స్‌లు బాబు హయాంలో వచ్చినవేనన్నారు.మా హయాంలో ఇక్క డిస్టిలరీకి పర్మీషన్ ఇవ్వలేదు.నాసిరకం లిక్కర్ అంటూ ఆ నాడు దుర్మార్గపు ప్రచారం చేశారు అన్నారు. బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్,999 లెజెండ్ , 999 పవర్ స్టార్ బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చినవే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం రేట్లు తగ్గిస్తామని చంద్రబాబు ప్రచారం చేశారు.ఇది నిజంగా పెద్ద స్కాం.వాటాలేసుకుని పంచుకోవడానికే మద్యం పాలసీ తెచ్చారు అన్నారు.లిక్కర్ పాలసీ నిజంగా మంచి చేసే పాలసీ అయితే ఎమ్మెల్యేలంతా ఎందుకు దాడులు చేస్తున్నారో చెప్పాలన్నారు.