Sunday, May 4, 2025
- Advertisement -

టీటీడీది గొప్ప వ్యవస్థ..చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే!

- Advertisement -

ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందన్నారు మాజీ సీఎం జగన్. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్‌ NABL సర్టిఫికెట్‌ తీసుకుని రావాలి… ప్రతి ట్యాంకు శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్‌ చేస్తారు అన్నారు. మూడు టెస్టులు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుందన్నారు.

చంద్రబాబు జరగనిది జరిగినట్లు అబద్ధాలు చెబుతున్నారు. జులై 12న శాంపిల్స్‌ తీసుకున్నారు.. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్‌ తీసుకున్నారు అన్నారు. జులై 17న NDDBకి నెయ్యి శాంపిల్స్‌ పంపించారు. NDDB ఆ రిపోర్ట్‌ను జులై 23న అందజేసింది. జులై 23న రిపోర్ట్‌ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం అన్నారు జగన్.

100 రోజుల అసమర్థ పాలనపై అందరూ దృష్టి పెట్టేసరికి.. నెయ్యి కల్తీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌ను స్టార్ట్ చేశాడని..దేవుడిని కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనే దుర్మార్గమైన మనస్తత్వం ఈ ప్రపంచ చరిత్రలో ఒక్క చంద్రబాబుకి మాత్రమే ఉందన్నారు జగన్.
సీఎం హోదాలో ఉంటూ ఇలాంటి దారుణమైన అసత్యాలు మాట్లాడటం ధర్మమా?, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి వారి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు.

నెయ్యి సప్లై కొత్తగా జరిగేది కాదు.. ప్రతీ ఆరు నెలకు ఒకసారి టెండర్లు ద్వారా సప్లై కాంట్రాక్టు ఇస్తారు..లడ్డూ, నైవేద్యం తయారీ అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. అందులో కొత్తగా మార్పులు చేసేది ఏమీ ఉండదు అన్నారు. దశాబ్దాలుగా తయారీ విషయంలో నియమనిబంధనలు ఫాలో అవుతున్నారు..పంపిణీ చేసే సంస్థలు NABL certification తీసుకొని రావాలి.. మళ్ళీ టీటీడీలో మూడు రకాల టెస్టుల్లో పాస్ అవ్వాలి అన్నారు. ఇవన్నీ పాస్ అయితే తప్ప సరుకులు లోపలకి రావు.. తేడా వస్తే బండి వెనక్కి పంపేస్తారు..ఏ రిపోర్టులో తేడా వచ్చినా వచ్చినా నెయ్యి, సరుకుల వాడకం జరగదు అన్నారు.

మా ఐదేళ్ల పాలనలో 18 సార్లు టెస్టింగ్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించాం…గతంలో చంద్రబాబు హయంలోనూ అనేక సార్లు వెనక్కి పంపారు..ఇలాంటి గొప్ప టెస్టింగ్ వ్యవస్థ టీటీడీలో ఉంది.. ఇది గొప్పగా చెప్పుకోవాలి అన్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -