వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిగా నిలబడిన ప్రజా ప్రతినిధులను అభినందించనున్నారు జగన్.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగే ఈ సమావేశానికి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోని వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ సభ్యులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నేతల్లో ధైర్యం నింపనున్నారు జగన్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని మెచ్చుకోనున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అధ్యక్షులు దిశా నిర్దేశం చేస్తారు.