భారత్‌లో రంజాన్ మాసం ప్రారంభమైంది. నెలవంక కనిపించడంతో జామా మసీదు ఇమామ్, లక్నోలోని షాహి ఇమామ్ రంజాన్ మాసం ప్రారంభాన్ని ధృవీకరించారు. ఈ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించింది.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
కోరికలను జయించడం, ఇంద్రియ నిగ్రహంతో హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం రోజాలో భాగం. ఖురాన్ ఉపవాసాన్ని సహనంగా పేర్కొంది. రోజా డాలు వంటిదని, ఖడ్గపు వేటు పడకుండా రక్షిస్తుందని చెబుతారు. ఓర్పు, స్థైర్యం, త్యాగం, సౌశీల్యం, మృదుస్వభావం, ప్రేమాభిమానాలు, దయ, దాతృత్వం వంటి గుణాలను రోజా అలవర్చుతుంది. రంజన్‌లో ఐదు పూటల నమాజ్, ఇషావేళలో పర్జ్ తర్వాత అదనంగా 20 రకాల తరావీహ్ నమాజ్‌లు చేస్తారు.
సూర్యోదయానికి ముందు తీసుకొనే భోజన పానీయాల సహరీ సమయంలో మేల్కొనకున్నా, సహరీ భుజించకున్నా ఉపవాసం పాటించాలి. ఆలస్యంగా భుజిస్తే ఆనాటి రోజా వ్యర్థం. సహరీ ఆఖరి వేళల్లో భుజించడం ఎంత పుణ్యమో సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విరమించేందుకు తినే ఇఫ్తార్ ప్రారంభంలో భుజించడం అంతే పుణ్యప్రదం.