Sunday, May 4, 2025
- Advertisement -

ఇక ఒంటరి పోరే..డెడ్‌లైన్ వర్కవుట్ కాలే!

- Advertisement -

వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న షర్మిల ఆశలు అడియాశలు అయినట్టేనా..?డెడ్‌లైన్ రేపటితో ముగుస్తున్న కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒంటరి పోరు తప్ప ఏం మిగలలేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఇదిగో పులి అంటే..అదిగో మేక అన్నట్లు ఉంది కాంగ్రెస్ – షర్మిల పార్టీల విలీన ప్రక్రియ. మొన్నటివరకు కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఖాయమని అంతా భావించారు కానీ రోజురోజుకు దూరం పెరిగిపోతూ వచ్చింది. దీనికి కారణం ఎవరైనా షర్మిల మాత్రం విలీనంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ – వైఎస్‌ఆర్‌టీపీ విలీన ప్రక్రియపై ఎలాంటి ముందడుగు పడకపోవడంతో కాంగ్రెస్‌కు ఈ నెల 30 వరకు డెడ్ లైన్ విధించింది షర్మిల. అంతేగాదు ఒక వేళ పొత్తులేకుంటే 119 స్ధానాల్లో బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు.

అయితే షర్మిల విధించిన డెడ్‌లైన్‌ని కాంగ్రెస్ పక్కన పెట్టేసినట్లేనని తెలుస్తోంది. ఇందుకు ప్రధానకారణం మాజీ మంత్రి తుమ్మల,పాలేరు నియోజకవర్గం. ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ లీడర్‌ తుమ్మల. గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే లీడర్‌. ఇక షర్మిల – తుమ్మల ఇద్దరు ఆశీస్తోంది పాలేరు సీటే. ఈ సీటు విషయంలో హామీ వచ్చాకే కాంగ్రెస్‌లో చేరారు తుమ్మల. దీంతో షర్మిలకు అప్పుడే అసహనం మొదలైన విలీనం తర్వాత చక్రం తిప్పుదామని భావించారు. కానీ తుమ్మల వెనకున్న నేతలు మాత్రం అసలు విలీనానికే బ్రేక్ వేశారు.

రాజకీయపరంగానూ తుమ్మల ముందు షర్మిల నతింగ్ అనే నిర్ణయానికి వచ్చారట కాంగ్రెస్ అగ్రనాయకత్వం. అందుకే తుమ్మలను చేర్చుకుని షర్మిలకు హ్యాండ్ ఇచ్చారట. ఇది అర్ధంకాని షర్మిల డెడ్ లైన్‌ల పేరుతో టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మరోకటి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి తెలంగాణలో షర్మిల చెప్పినట్లు 119 స్ధానాల్లో పోటీచేస్తారా లేక పోటీ నుండి తప్పుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -