Saturday, May 3, 2025
- Advertisement -

21 మంది ఎంపీలు ఉన్నా..ఏపీకి ప్రత్యేక హోదా ఏది!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల. మీడియాతో మాట్లాడిన షర్మిల…మంత్రి లోకేష్ …ప్రధాని మోడీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారట. 21 మంది ఎంపీలు ఇస్తామని చెప్పి ఇచ్చారట. అయ్యా లోకేష్ … మీరు ఇచ్చిన మాట సరే…మోడీ ఇచ్చిన మాట పరిస్థితి ఏంటి..? చెప్పాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో లక్షలాది ప్రజల ముందు నిలబడి మరి మోడీ మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట ఎక్కడ పోయింది. హోదా వచ్చి ఉంటే పోటీ పడి మరీ పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2వేల పరిశ్రమలు రాగా.. హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 10వేల పరిశ్రమలు వచ్చాయి. పోలవరం పూర్తి చేస్తా అన్నారు ఆ మాట ఏమైందని ప్రశ్నించారు.

అమరావతిని న్యూఢిల్లీని మించిన రాజధానిని చేస్తా అన్నారు. చివరకు మట్టి కొట్టి పోయారు. అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చే బాధ్యత నాది అని మోడీ అన్నారు. కానీ ఇంతవరకు అవి నెరవేర్చలేదు అన్నారు. విశాఖ స్టీల్ కి ఒక్క క్యాపిటల్ మైన్ ఇస్తే మోడీకి జరిగే నష్టం ఏముంది..? మొన్నటికి మొన్న 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించారు. నేను నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరిస్తే వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మీరు మోడీకి ఇచ్చిన మాట బాగానే నిలబెట్టుకున్నారు. మరి రాష్ట్రానికి మోడీ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు. అందుకే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని లోకేష్ నిలదీసి అడగాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -